ఇనుగుర్తిలో దీక్షలకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే సంఘీభావం | MLA KHAIRATABAD in inugurthi | Sakshi
Sakshi News home page

ఇనుగుర్తిలో దీక్షలకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే సంఘీభావం

Sep 14 2016 12:02 AM | Updated on Oct 30 2018 4:19 PM

చారిత్రక ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రతోపాటు, భౌగోళికంగా అన్ని వనరులున్న ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలన్నారు.

కేసముద్రం : చారిత్రక ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రతోపాటు, భౌగోళికంగా అన్ని వనరులున్న ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలన్నారు.
 
అనంతరం ఎమ్మెల్యేకు సాధన సమితిసభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. దీక్షలో కూర్చున్న సిరంశెట్టి నవీన్‌ కుమార్, కూటికంటి ప్రణయ్, గణేష్, మధు, కిరణ్‌కుమార్, సాయికుమార్, దయాకర్, ప్రశాంత్‌కు పూలమాలలు వేశారు. రాష్ట్ర కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్‌రావు, సాధనసమితి కన్వీనర్‌ చిన్నాల కట్టయ్య, కోకన్వీనర్‌ దార్ల భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement