సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పిన బీజేపీకి పడుతుందని రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకీ కాంగ్రెస్ గతే..
Jul 30 2016 9:31 PM | Updated on Sep 4 2017 7:04 AM
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) :
సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పిన బీజేపీకి పడుతుందని రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో కమలనాథులు సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని రాజ్యసభలో అన్నారని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీలు, జాతీయప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్రంలో ఉన్న రెండు పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement