కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డికాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సూరంపుడి శాంతి(28) పదే ళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శాంతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.