వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పెద్దాపురంలోని నూతన కూరగాయల మార్కెట్‌ను
-
మార్కెటింగ్ శాఖ కమిషనర్
పెద్దాపురం :
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పెద్దాపురంలోని నూతన కూరగాయల మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పెద్దాపురం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చైర్మ¯ŒS ముత్యాల వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ నిధులు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల్లో కూరగాయాల మార్కెట్లకు నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. వీటి ద్వారా హోల్‌సేల్ ధరలకే కూరగాయలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరి బాబు రాజు, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ డీఈఈ ప్రభాకరరావు, ఏఈ సుధాకర్, వార్డు కౌన్సిలర్లు నాగమ ణి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సూర్యప్రకాష్, సూపర్ వైజర్ వెంకన్నబాబు పాల్గొన్నారు.