11న మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ | management fest on 11th | Sakshi
Sakshi News home page

11న మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌

Mar 1 2017 9:44 PM | Updated on Sep 5 2017 4:56 AM

సంస్కృతీ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆధ్వర్యంలో విజయోత్సవ్‌–2017 పేరుతో ఈనెల 11,12 తేదీల్లో కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లు సంస్కృతీ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

పుట్టపర్తి టౌన్‌ : సంస్కృతీ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆధ్వర్యంలో విజయోత్సవ్‌–2017 పేరుతో ఈనెల 11,12 తేదీల్లో కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లు సంస్కృతీ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. కళాశాలలో బుధవారం సిబ్బందితో కలిసి ఆయన విజయోత్సవ్‌–2017 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కళాశాలతో పాటు జర్మనీకి చెందిన రైజ్‌ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

దేశీయంగా ప్రఖ్యాతి గాంచిన ఐదు కార్పొరేట్‌ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయన్నారు. విద్యార్థులకు పలు అంశాలపై వేదిక కల్పిస్తారని, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9100974543 ,91009745538 నెంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాసన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement