'స్వారీ' మమత.. | man committed suicide for love failure | Sakshi
Sakshi News home page

'స్వారీ' మమత..

Jun 11 2016 11:35 PM | Updated on Aug 11 2018 8:48 PM

ఓ యువకుడు మర్రిచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

మహేశ్వరం: ఓ యువకుడు మర్రిచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలోని సురం చెరువులో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. తుక్కుగూడ గ్రామానికి చెందిన గొరిగే పాండు(27) నగరంలోని కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

శనివారం ఇంటి నుంచి వెళ్లిన పాండు సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పహాడిషరిఫ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాండు జేబులో దొరికిన కాగితంపైన 'స్వారీ మమత' అని రాసి ఉంది. దీంతో ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement