కాలువై పారిన ముడి పామాయిల్ | Loaded palm oil lorry overturns | Sakshi
Sakshi News home page

కాలువై పారిన ముడి పామాయిల్

Jun 14 2016 3:36 PM | Updated on Sep 4 2017 2:28 AM

కాలువై పారిన ముడి పామాయిల్

కాలువై పారిన ముడి పామాయిల్

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద పామాయిల్ వరదై ప్రవహించింది. స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకెళ్లారు.

గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద పామాయిల్ వరదై ప్రవహించింది. స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకెళ్లారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు ముడి పామాయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకులోని ఆయిల్ కిందికి లీకై పక్కనే ఉన్న పంట కాల్వ నిండింది. గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు, బకెట్లతో అక్కడికి చేరుకుని పామాయిల్‌ను పట్టుకెళ్లిపోయారు. అది వంటకు పనికి రాదని ట్యాంకర్ డ్రైవర్ వారించినా పట్టించుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement