ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ | List of those who have come from AP | Sakshi
Sakshi News home page

ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్

Oct 20 2015 4:54 AM | Updated on Sep 3 2017 11:12 AM

ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి వచ్చిన ఆరుగురు అధికారులకు సాంకేతిక విద్యాశాఖలో తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి వచ్చిన ఆరుగురు అధికారులకు సాంకేతిక విద్యాశాఖలో తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏపీ నుంచి వచ్చిన ఎ.పుల్లయ్యను మెదక్ జిల్లా గోమారం పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, బి.కుటుంబశాస్త్రిని కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా నియమించారు. పీవీ రఘును క్యూక్యూ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ప్రభాకర్‌రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌గా, జయశేఖర్‌ను కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా నియమించారు. చంద్ర శ్రీరాంకుమార్‌ను మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్‌లో కంప్యూటర్ హెడ్‌గా నియమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement