గ్రంథాలయ అప్‌గ్రేడ్‌కు మోక్షం | libraries updation will be happen... | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ అప్‌గ్రేడ్‌కు మోక్షం

Sep 4 2016 11:58 PM | Updated on Sep 19 2019 8:59 PM

జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మానుకోట శాఖ గ్రంథాలయం అప్‌గ్రేడ్‌ కానుంది. ఈ గ్రంథాలయం ప్రస్తుతం గ్రేడ్‌ 3గా ఉంది. గ్రంథాలయ కమిటీ, పలు సంఘాలు గ్రేడ్‌ 2 కోసం కొన్నేళ్లుగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు.

మహబూబాబాద్‌ : జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మానుకోట శాఖ గ్రంథాలయం అప్‌గ్రేడ్‌ కానుంది. ఈ గ్రంథాలయం ప్రస్తుతం గ్రేడ్‌ 3గా ఉంది. గ్రంథాలయ కమిటీ, పలు సంఘాలు గ్రేడ్‌ 2 కోసం కొన్నేళ్లుగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయితే జిల్లా ఏర్పాటుతో మానుకోట గ్రంథాలయం గ్రేడ్‌–1 అయ్యే అవకాశం ఉం ది. 1939 సంవత్సరంలో బాపూజీ పేర గ్రంథాలయాన్ని ఏర్పా టు చేయగా 1964లో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఈ గ్రం థాలయంలో 24వేల పుస్తకాలు, 2,450 మంది సభ్యులు ఉన్నా రు. రోజూ వచ్చే పాఠకుల సంఖ్య 500కు పైగా ఉంటుంది. పాఠకుల సంఖ్య మేరకు గ్రంథాలయం అభివృద్ధి జరగలేదు. ఉన్న రెండు గదుల్లో ఒకటి శిథిలావస్థకు చేరింది. దీంతో రీడింగ్‌ హాల్‌లోనే పుస్తకాలు భద్రపరుస్తున్నారు. క్రమంగా గ్రంథాలయానికి ఆదరణ కరువైంది. రెండేళ్లలో పోటీ పరీక్షల మెటీరి యల్, ఇతర పుస్తకాలు రావడంలేదు. 17 పుస్తకాలు మాత్రమే వచ్చాయని సిబ్బంది తెలిపారు. మానుకోట గ్రంథాలయం గ్రేడ్‌–3గా ఉండగా నర్సంపేట, జనగామ మాత్రం గ్రేడ్‌–2లో ఉన్నా యి. గ్రేడ్‌–2 కోసం ఎంతోకాలంగా కమిటీ సభ్యులు, పలు సంఘాల, పలు పార్టీలు పోరాడాయి. ఇక్కడ కనీసం మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేవు. గ్రంథ పాలకుడు (లైబ్రేరియన్‌) కూడా ఇన్‌చార్జే ఉన్నారు. మరో ఫుల్‌టైమ్‌ వర్కర్‌ పనిచేస్తున్నా రు. జంగిలిగొండ, సబ్‌జైల్‌లో బుక్‌ డిపాజిట్‌ సెంటర్లు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) కొనసాగుతున్నాయి.
 
నంబర్‌ వన్‌ గ్రేడ్‌..
 
మానుకోట జిల్లా ఏర్పాటుతో మానుకోట శాఖ గ్రంథాలయం గ్రేడ్‌ 3 నుంచి గ్రేడ్‌ 1కు అప్‌గ్రేడ్‌ కానుంది. గ్రేడ్‌–1 అయితే అన్ని హంగుల భవనం, ఇంటర్నెట్‌ సౌకర్యం, పుస్తకాలు, సిబ్బంది సంఖ్య పెరుగుదల, ఇతర సౌకర్యాలు మెరుగుపడతాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచే ఉంటుంది. గ్రేడ్‌ 2లో వార్తా పత్రికలు తప్పా పుస్తకాల సెక్షన్‌ ఉండదు. కానీ గ్రేడ్‌–1 అయితే పలు రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement