మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
మందమర్రి: మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.
విలేకరులతో తమ్మినేని మాట్లాడుతూ..అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. అక్రమ అరెస్ట్‌లు సమ్మెను ఆపలేవన్నారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తే ప్రభుత్వానికే నష్టమన్నారు. ధర్నాలో పాల్గొన్న తమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.