బుజ్జాయిని బలిగొన్న బకెట్‌ | kid drowning to bucket | Sakshi
Sakshi News home page

బుజ్జాయిని బలిగొన్న బకెట్‌

Oct 26 2016 7:24 PM | Updated on Sep 28 2018 3:41 PM

బుజ్జాయిని బలిగొన్న బకెట్‌ - Sakshi

బుజ్జాయిని బలిగొన్న బకెట్‌

తన బుజ్జిబుజ్జి మాటలతో ఆ ఇంట వెలుగులు పండించిన బుజ్జాయిని రక్కసి బకెట్‌ బలితీసుకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తన మూడేళ్ల చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది.

విజయవాడ (మధురానగర్‌) : తన బుజ్జిబుజ్జి మాటలతో ఆ ఇంట వెలుగులు పండించిన బుజ్జాయిని రక్కసి బకెట్‌ బలితీసుకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తన మూడేళ్ల చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. స్థానిక మధురానగర్‌ వీవీ నరసరాజు రోడ్డుకు చెందిన మజ్జి గణేష్‌ దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె కీర్తనకు మూడేళ్లు. ఇటీవలే జన్మదిన వేడుకలు జరుపుకొంది. బుధవారం ఉదయం అందరూ పన్నుల్లో ఉండగా, కీర్తన ఇంటి బయట నీటితో నిండిన బకెట్‌ వద్దకు వెళ్లింది. అక్కడే ఆడుకుంటూ కొద్దిసేపటికి బకెట్‌లోకి వంగి పడిపోయింది. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక కీర్తన చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చెప్పడంతో తల్లిదండ్రులు గమనించారు. అయితే, కీర్తన అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ ఆత్కూరి రవికుమార్, టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు పీవీఆర్, ఉపాధ్యక్షుడు మహాలక్ష్మయ్య తదితరులు కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement