టెక్కలిలో నకిలీ నోట్ల తయారీ ముఠా? | kake currency batch arrested | Sakshi
Sakshi News home page

టెక్కలిలో నకిలీ నోట్ల తయారీ ముఠా?

Sep 29 2016 11:33 PM | Updated on Jul 26 2018 1:42 PM

నందిగాం మండలం దేవళభద్ర గ్రామానికి చెందిన ఓ జవాన్‌ నుంచి గత ఏడాది టెక్కలి  పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు (ఫైల - Sakshi

నందిగాం మండలం దేవళభద్ర గ్రామానికి చెందిన ఓ జవాన్‌ నుంచి గత ఏడాది టెక్కలి పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు (ఫైల

జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టవడంతో డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో దాని ములాలు ఉన్నట్టు అనుమానాలు రేగుతున్నాయి. టెక్కలిలో కొన్నాళ్లుగా గుట్టుగా నకిలీ నోట్ల ముద్రిస్తున్నట్టు దీని వెనుక పేరొందిన ప్రముఖులు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా వీరికి ఓ శాఖ అధికారులు కూడా తోడైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

టెక్కలి : జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టవడంతో డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో దాని ములాలు ఉన్నట్టు అనుమానాలు రేగుతున్నాయి. టెక్కలిలో కొన్నాళ్లుగా గుట్టుగా నకిలీ నోట్ల ముద్రిస్తున్నట్టు దీని వెనుక పేరొందిన ప్రముఖులు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా వీరికి ఓ శాఖ అధికారులు కూడా తోడైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్, జ్యువెలరీ, గ్రానైట్, వైన్స్, ఫైనాన్స్‌ తదితర వ్యాపారాల్లో వీరు తయారు చేస్తున్న నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్టు చర్చ సాగుతోంది. జిల్లాలో పలాస, విశాఖకు చెందిన నకిలీ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న తరువాత ఈ ప్రాంతంలో సంబంధిత వ్యక్తులు లోలోపల భయపడుతున్నట్టు సమాచారం.
 
వీటిని నిరోధించాల్సిన వారిలోనే ఒకరిద్దరు దిగువస్థాయి వ్యక్తులు మద్దతుగా ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. డివిజన్‌ కేంద్రానికి సమీపంలోనే ఒడిశా సరిహద్దు ఉండడంతో వీరి వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతున్నట్టు చర్చ జరుగుతుంది. గత ఏడాది ఆగస్టు 16న నందిగాం మండలం దేవళభద్ర గ్రామానికి చెందిన ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతం నుంచి సుమారు రూ.37వేలు దొంగ నోట్లను తీసుకువచ్చి పోలీసులకు చిక్కిన విషయం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించి ఇప్పటికీ కేసు కొనసాగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత వ్యక్తిపై ఎటువంటి చర్యలు చేపట్టారో ఇప్పటికీ తేలలేదు. కాలంతో పాటు ఆ విషయం కూడా కనుమరుగైంది. ఈ విషయమై ఓ పార్టీకి చెందిన కీలక నాయకుడు అప్పట్లో రంగ ప్రవేశం చేసి వ్యవహారాన్ని కనుమరుగయ్యేటట్టు కథనం నడిపాడని ఇప్పటికీ చెబుతుంటారు. ఏదీఏమైనా పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నిఘా వేస్తే ఇక్కడ జరుగుతున్న తంతు బయటపడక తప్పదని స్థానికులు చెబుతున్నారు. ఈ దిశగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement