కడియం : నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు పోటీ చేయదలచిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నిక నిర్వహణ కమిటీ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తొలి రోజైన బుధవారం అధ్యక్ష పదవికి 1, 10, 7వ వార్డుల డైరెక్టర్ల పదవులకు ఒక్కో ఒక నామినేషన్ అసోసియేషన్ కార్యాలయానికి అందిం
‘నర్సరీ’ ఎన్నికలకు నామినేషన్ల బోణీ
Sep 21 2016 11:26 PM | Updated on Oct 30 2018 7:30 PM
	కడియం : నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు పోటీ చేయదలచిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నిక నిర్వహణ  కమిటీ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తొలి రోజైన బుధవారం అధ్యక్ష పదవికి 1,  10, 7వ వార్డుల డైరెక్టర్ల పదవులకు ఒక్కో ఒక నామినేషన్ అసోసియేషన్ కార్యాలయానికి అందింది. కాగా మూడేళ్లక్రితం నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమైనప్పటికీ, ఈసారి మాత్రం పోటీకి పలువురు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తాము అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు శ్రీ సత్యదేవ నర్సరీ రైతు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), శ్రీ శివాంజనేయ నర్సరీ రైతు మల్లు పోలరాజు, శ్రీ శివరామా నర్సరీ రైతు పాటంశెట్టి సుబ్బారావు ప్రకటించారు. అలాVó  వారు అసోసియేషన్ సభ్యులను కలుసుకుని విస్తృతంగా ప్రచారం కూడా చేపడుతున్నారు. డైరెక్టర్ల పదవులకు పోటీ చేస్తున్న పలువురు యువ రైతులు కూడా  ప్రచార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోపక్క అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తిచేసేందుకు పలువురు నాయకులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. పోటీ కారణంగా అంతరాలు పెరగడం తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండదన్న వాదనతో ఏకగ్రీవ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల అనంతరం పరిస్థితిని బట్టి ఏకగ్రీవ ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 24, 25 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణలు ఉంటాయి. ఆ తర్వాత నర్సరీ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవమా? పోటీయా? అన్నది తేలాల్సి ఉంది. 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
