స్వల్పంగా పెరిగిన శ్రీశైలం నీటిమట్టం | increase water level in srisailam dam | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన శ్రీశైలం నీటిమట్టం

Sep 4 2016 12:42 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 872.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 872.60 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 872.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 872.60 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి జూరాల నుంచి శ్రీశైలానికి విడుదలయ్యే నీరు నిలిచిపోయింది. రెండు జలవిద్యుత్‌ కేంద్రాలలో ఎటువంటి ఉత్పాదన జరగలేదు. జలాశయంలోని బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 4,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 152.8314 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement