భార్యపై భర్త దాష్టీకం | Husband attacked wife | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త దాష్టీకం

Jul 17 2016 7:20 PM | Updated on Mar 28 2018 11:26 AM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చావబాదాడు.

 రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీర నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. నాగేశ్ భార్యను అనుమానించటంతోపాటు అదనంగా కట్నం తేవాలంటూ గొడవకు దిగేవాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నాగేశ్ భార్యను తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement