జయభరత్ను ఆదుకోండి | Helps to Guntur Student Jayabharath reddy for surgery in US | Sakshi
Sakshi News home page

జయభరత్ను ఆదుకోండి

Apr 11 2016 1:08 PM | Updated on Apr 3 2019 7:53 PM

జయభరత్ను ఆదుకోండి - Sakshi

జయభరత్ను ఆదుకోండి

అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన గుంటూరు విద్యార్ధి జయభరత్ రెడ్డి(24 )కు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన గుంటూరు విద్యార్ధి జయభరత్ రెడ్డి(24 )కు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఓ సర్జరీ చేసిన వైద్యులు... మరో సర్జరీ చేయాలని సూచించారు. అమెరికాలో వైద్యం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో అతని స్నేహితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు అమెరికాలో విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు.

ఇప్పటి వరకు 50 వేల డాలర్లు సేకరించగా.. మరో 70 వేల డాలర్లు అవసరమవుతాయి. దీంతో భరత్కు మెరుగైన చికిత్సను అందిచేందుకు అతని స్నేహితులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అమెరికాలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులు అమెరికా వెళ్లేందుకు ప్రజా ప్రతినిధులను, గుంటూరు జిల్లా కలెక్టర్ను సాయం చేయాలని కోరుతున్నారు

జయభరత్ రెడ్డిని ఆదుకోవాలనికునే వారు సాత్విక్  0019734328000, పురుషోత్తమ్ రెడ్డి 0018167288626 నంబర్లలో సంప్రదించవచ్చు. అలాగే https://www.gofundme.com/jcyg7xh8 వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement