వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన | glorious Suvratindrula aaradhana | Sakshi
Sakshi News home page

వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన

May 8 2017 12:01 AM | Updated on Sep 5 2017 10:38 AM

వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన

వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన

శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సువ్రతీంద్రుల ఆరాధనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సువ్రతీంద్రుల ఆరాధనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నేతృత్వంలో ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం సువ్రతీంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పంచామృతాభిషేకాలు గావించి విశేషంగా అలంకరించారు. శాస్త్రోక్త పూజలనంతరం మంగళహారతులు పట్టారు. వేడుకల్లో మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement