‘మెనూ ప్రకారం భోజనం అందించాలి’ | for students mess should as per menu | Sakshi
Sakshi News home page

‘మెనూ ప్రకారం భోజనం అందించాలి’

Jul 27 2016 11:34 PM | Updated on Sep 4 2017 6:35 AM

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలుర వసతి గహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా..? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

చెన్నూర్‌: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని బీసీ, ఎస్సీ  బాలుర వసతి గహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  వంట గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా..? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
        ఈ సందర్భంగా వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూరగాయలు, పప్పులతో కూడిన భోజనాన్ని తప్పక అందజేయాలన్నారు. వార్డెన్‌లు అందుబాటులో ఉండాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేశం పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement