కానిస్టేబుల్‌ ఉద్యోగాల రాతపరీక్షకు ఏర్పాట్లు | for constable jobs written exam | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఉద్యోగాల రాతపరీక్షకు ఏర్పాట్లు

Nov 5 2016 12:34 AM | Updated on Sep 4 2017 7:11 PM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట)/భీమవరం : పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న నిర్వహించనున్న రాత పరీక్షల నిమిత్తం జిల్లా అభ్యర్థుల కోసం ఏలూరు, భీమవరంలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆయా కేంద్రాల రీజనల్‌ కోఆర్డినేటర్లు గుత్తా సాంబశివరావు, పెన్మెత్స రామకృష్ణంరాజు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట)/భీమవరం : పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న నిర్వహించనున్న రాత పరీక్షల నిమిత్తం జిల్లా అభ్యర్థుల కోసం ఏలూరు, భీమవరంలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆయా కేంద్రాల రీజనల్‌ కోఆర్డినేటర్లు గుత్తా సాంబశివరావు, పెన్మెత్స రామకృష్ణంరాజు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లాలో మొత్తం 14,289 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు చెప్పారు. వీరికోసం ఏలూరులో 20 పరీక్ష కేంద్రాలు, భీమవరంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు.  అభ్యర్థులు పరీక్షకు అరVýæంట ముందు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement