జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో మంటలు సోమవారం సాయంత్రానికి పూర్తిగా అదుపులోకి వస్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు.
- సాయంత్రానికి మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్న అధికారులు
జవహర్‌నగర్ (రంగారెడ్డి)
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో మంటలు సోమవారం సాయంత్రానికి పూర్తిగా అదుపులోకి వస్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం రాత్రి డంపింగ్ యార్డులో మంటలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వంతో మాట్లాడి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కాగా, రాత్రి నుంచి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టగా... సోమవారం ఉదయానికి అవి అదుపులోకి వచ్చాయి. అయినా మధ్యలో నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి.