చికిత్స పొందుతూ రైతు మృతి | farmer died | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ రైతు మృతి

Mar 6 2017 12:38 AM | Updated on Oct 1 2018 2:44 PM

రాప్తాడు : జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా టీబీ క్రాస్‌ సమీపంలో గత నెల 22న చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న రైతు నాగభూషణం ఆదివారం మృతిచెందాడు.

రాప్తాడు : జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా టీబీ క్రాస్‌ సమీపంలో గత నెల 22న చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న రైతు నాగభూషణం ఆదివారం మృతిచెందాడు. తాము పండించిన బెండకాయలను ఐచర్‌ వాహనంలో బెంగళూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఘటనలో హంపాపురానికి చెందిన గొరవ నాగభూషణం (42), మరో 20 మంది రైతులు గాయపడ్డారు.  ఎం.బండమీదపల్లికి చెందిన నడిమిదొడ్డి నాగేంద్ర సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగభూషణం ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. సాయంత్రం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. మృతుడికి భార్య నాగేంద్రమ్మ, కుమారుడు మురళిమోహన్, కుతూరు నందినిలు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement