జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ సర్వేపై అలసత్వం విడనాడాలని జెడ్పీ సీఈఓ బి.నగేష్ పంచాయతీ రాజ్ ఉద్యోగులను ఆదేశించారు.
పల్స్ సర్వేపై అలసత్వం వద్దు
Jul 20 2016 11:15 PM | Updated on Sep 4 2017 5:29 AM
►జెడ్పీ సీఈఓ నగేష్
శ్రీకాకుళం టౌన్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ సర్వేపై అలసత్వం విడనాడాలని జెడ్పీ సీఈఓ బి.నగేష్ పంచాయతీ రాజ్ ఉద్యోగులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో, ఎంపీడీఓలతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ట్యాబ్‌ల పనితీరుపై ఆరా తీశారు. ప్రతి కుటుంబంలో సర్వేకు అవసరమైన డేటాతోపాటు జియో ట్యాగింగ్ చేసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని, పంచాయతీ పరిధిలో సమగ్ర డేలా కార్యదర్శుల చేతిలో ఉంటుందని తెలిపారు. కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర, పరిపాలనాధికారి కిరణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
Advertisement
Advertisement