జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం | districtlevel cricket compitions bigne | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Jan 11 2017 10:05 PM | Updated on Sep 5 2017 1:01 AM

జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

నూజెండ్ల: మండలంలోని మారెళ్లవారి పాలెం గ్రామంలో వైఎస్సార్‌ జెఎస్‌ఆర్‌ ఎంపిఎల్‌ –5 జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

  
 
 
నూజెండ్ల: మండలంలోని మారెళ్లవారి పాలెం గ్రామంలో వైఎస్సార్‌ జెఎస్‌ఆర్‌ ఎంపిఎల్‌ –5  జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త జక్కిరెడ్డి చిన సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్‌ మారెళ్ల పేరిరెడ్డి దివంగత నాయకులు  జక్కిరెడ్డి సుబ్బారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్‌  ట్రోఫీని ఆవిష్కరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా  గ్రామ సర్పంచ్‌ పేరిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లనుంచి నిర్విరామంగా క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేందకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. క్రీడాప్రాంగణం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రెండు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతోపాటు వీక్షించేవారికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన చిన్నసుబ్బారెడ్డికి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వందలాది మంది క్రీడాభిమానుల మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, మారెళ్ల నాగిరెడ్డి, గోవిందరెడ్డి, కమిటీ సభ్యులు గాదె నాగార్జున రెడ్డి, రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారెళ్లవారిపాలెం– తలార్లపల్లి జట్లు తలపడగా మరెళ్లవారిపాలెం జట్టు విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement