టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు | disputes between tdp leaders in giddaluru | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు

Oct 30 2016 3:42 PM | Updated on Aug 10 2018 9:46 PM

టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు - Sakshi

టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి.

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్‌ అన్నా రాంబాబు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు.

టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి తొక్కేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో​ జోక్యం చేసుకోవాలని అన్నా రాంబాబును కోరారు. కార్యకర్తల ఒత్తిడితో అన్నా రాంబాబు.. అశోక్‌ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement