రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో పేదలకు ఒరిగిందేమి లేదని, ఊకదంపుడు ఉపన్యాస్యాలు తప్ప సమస్యల పరిష్కారం శూన్యమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు.
గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో పేదలకు ఒరిగిందేమి లేదని, ఊకదంపుడు ఉపన్యాస్యాలు తప్ప సమస్యల పరిష్కారం శూన్యమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు.
టీడీపీకి బీసీలు వెన్నెమొక అని చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వడ్డెర, వాల్మీకి, రజక, బెస్త, మేదర తదితర కులాలను ఎస్టీల్లో చేరుస్తానని, రూ.10 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చనపుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారని విశ్వసించాలని ఆయన ప్రశ్నించారు.