ఘనంగా సీఆర్‌పీఎఫ్‌ జవాను అంత్యక్రియలు | crpf jawan ceromany in dharmavaram | Sakshi
Sakshi News home page

ఘనంగా సీఆర్‌పీఎఫ్‌ జవాను అంత్యక్రియలు

Jun 21 2017 10:40 PM | Updated on Aug 11 2018 9:02 PM

ఘనంగా సీఆర్‌పీఎఫ్‌ జవాను అంత్యక్రియలు - Sakshi

ఘనంగా సీఆర్‌పీఎఫ్‌ జవాను అంత్యక్రియలు

ధర్మవరం పట్టణానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను జార్ఖండ్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.

ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను జార్ఖండ్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ గోరకాటి పురుషోత్తంరెడ్డి, సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి, చౌడప్ప, లోనికోట అమర్, నరేంద్రరెడ్డిలు జవాను గురుప్రసాద్‌ భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.

అనంతరం జవాను ఇంటి వద్ద నుంచి పుష్ప వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి వందలాది మంది జనసందోహం నడుమ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గురుప్రసాద్‌ తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు గురుప్రసాద్‌ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడని ఉన్నతస్థాయి అధికారులు విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య జవాను అంత్యక్రియలు ముగిశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement