పెబ్బేరు: మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో వైశాఖాపూర్ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహర దీక్షలు బుధవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. గ్రామస్తులకు ఇబ్బందులు తలపెడుతున్న పెద్దగుట్ట మైనింగ్ లీజు ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న రిలేదీక్షలు
Jul 21 2016 1:19 AM | Updated on Sep 4 2017 5:29 AM
పెబ్బేరు: మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో వైశాఖాపూర్ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహర దీక్షలు బుధవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. గ్రామస్తులకు ఇబ్బందులు తలపెడుతున్న పెద్దగుట్ట మైనింగ్ లీజు ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం రిలే దీక్షలకు టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ మద్దతు ప్రకటించారు.గ్రామస్తుల నిర్ణయం మేరకు ప్రభుత్వం స్పందించి వెంటనే మైనింగ్ లీజు ను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో వలుగుమాన్ బాల్‌రాం, జక్కుల వెంకటయ్య, వైనం ఆంజనేయులు, రామకృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement