ఏకంగా పనిచేసే సంస్థకే కన్నం వేశాడు! | co-ordinator kothapally james robbery at muthoot finance | Sakshi
Sakshi News home page

ఏకంగా పనిచేసే సంస్థకే కన్నం వేశాడు!

Jan 9 2016 11:34 PM | Updated on Sep 3 2017 3:23 PM

ఏకంగా పనిచేసే సంస్థకే కన్నం వేశాడు!

ఏకంగా పనిచేసే సంస్థకే కన్నం వేశాడు!

ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అదే కంపెనీ ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు.

రాజమండ్రి రూరల్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అదే కంపెనీ ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. సంస్థ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి జేమ్స్ వినియోగదారులకు విక్రయించేందుకు శాఖలో ఉంచిన 75 బంగారు నాణాలను స్వాహా చేశాడు.

సుమారు 750 గ్రాముల బరువైన ఈ నాణాల విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. దీనిపై ముత్తూట్ ఫైనాన్స్ ఉన్నతాధికారి జార్జిబాబు శనివారం సాయంత్రం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేకాట, గుర్రపు పందేలు లాంటి వ్యసనాలకు బానిసగా మారిన జేమ్స్ ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement