కర్నూలు వ్యాఖ్యాతకు సీఎం అభినందన | cm greetings for kurnool commentator | Sakshi
Sakshi News home page

కర్నూలు వ్యాఖ్యాతకు సీఎం అభినందన

Aug 16 2016 2:00 AM | Updated on Sep 4 2017 9:24 AM

కర్నూలు వ్యాఖ్యాతకు సీఎం అభినందన

కర్నూలు వ్యాఖ్యాతకు సీఎం అభినందన

70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్‌ ట్రై నింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకలలో వ్యాఖ్యాతగా పాల్గొన్న కర్నూలు కథారచయిత ఇనాయతుల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

కర్నూలు(అర్బన్‌): 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్‌ ట్రై నింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకలలో వ్యాఖ్యాతగా పాల్గొన్న కర్నూలు కథారచయిత ఇనాయతుల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అనంతపురం స్వాతంత్య్రోద్యమ చరిత్ర, అమరావతి విశేషాలను, పోలీసు కవాతు దశ్యాలను, శకటాల ప్రదర్శనను ఆసక్తికరంగా వ్యాఖ్యానించిన తీరును మెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, బీజేపీ నండూరి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకాష్‌ టక్కర్, ఎపీఎస్‌పీ బెటాలియన్‌ ఐజీ ఆర్‌కే మీనా, అనంతపురానికి చెందిన ప్రముఖ రచయిత ఏలూరు యంగన్నకవి తదితరులు ఇనాయతుల్లాను అభినందించారు. ఈయన గతంలో విజయవాడ, వైజాగ్‌లలో జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర  వేడులకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement