నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి | child dies falls into bucket | Sakshi
Sakshi News home page

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

Sep 2 2016 12:42 AM | Updated on Sep 4 2017 11:52 AM

మర్తాడులో నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

గార్లదిన్నె: మర్తాడులో నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మర్తాడు గ్రామానికి చెందిన బాషా, భాను కుమార్తె షకీదా (5) ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా గురువారం సాయంత్రం ఇంటి సమీపంలో కనిపించడం లేదు. దీంతో బంధువులు చుట్టు పక్కల అంతా వెతికారు. ఆఖరికి బాషా ఇంటి సమీపంలో ఉన్న నీటి తొట్టెలో షకీదా మృతదేహాన్ని కనుకున్నారు. నీళ్లలో విగత జీవిలా పడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement