
చింతకుంటలో జ్వరంతో చిన్నారి మృతి
చింతకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆండ్రూస్ కుమార్తె బిల్లా ట్రిన్ను అనే ఏడాది బాలిక తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది.
ముద్దనూరు: చింతకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆండ్రూస్ కుమార్తె బిల్లా ట్రిన్ను అనే ఏడాది బాలిక తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది. బాధితుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ట్రిన్ను కొన్ని రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధ పడుతుండేది. స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అకస్మాత్తుగా శనివారం మృతి చెందింది. ఆండ్రూస్ దంపతులకు ట్రిన్ను మొదటి సంతానం.