ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల | Sakshi
Sakshi News home page

ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల

Published Thu, Nov 26 2015 2:18 PM

ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల - Sakshi

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఇసుక విధానంపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 387 ఇసుక రీచ్ల గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 368 రీచ్లలో తవ్వకాలు జరుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఇసుక రీచ్లలో అక్రమాలు అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు.  విజయవాడ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా 44 రీచ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొత్తం 6,317 వాహనాలు జీపీఎస్కి అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.


రాష్ట్రంలో 387 ఇసుక రీచ్ల గుర్తింపు
368 రీచ్లలో తవ్వకాలు
రూ.2 కోట్ల 82 లక్షల క్యుబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు
1.37 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయం
4,023 స్వయం సహాయక గ్రూపులకు ఇసుక రీచ్ల అప్పగింత
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో రూ.147.37 కోట్ల ఆదాయం
అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో రూ.12.79 కోట్ల ఆదాయం

Advertisement

తప్పక చదవండి

Advertisement