న్యాయవాదిపై కేసు నమోదు | case file on lawyer | Sakshi
Sakshi News home page

న్యాయవాదిపై కేసు నమోదు

Mar 15 2017 11:52 PM | Updated on Sep 5 2017 6:10 AM

అనంతపురం అరవింద్‌నగర్‌లో నివాసముంటున్న న్యాయవాది గంగాధర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక టూ టౌన్‌ పోలీసులు తెలిపారు.

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం అరవింద్‌నగర్‌లో నివాసముంటున్న న్యాయవాది గంగాధర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక టూ టౌన్‌ పోలీసులు తెలిపారు. గోరంట్లకు చెందిన ఓ మహిళకు సదరు లాయర్‌ రూ.3 లక్షలు అప్పు ఉన్నారన్నారు. వాటిని అడిగేందుకు వచ్చిన అమెను దూషించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించినట్లు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement