బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కులేదు | BJP and TDP have no right to vote | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కులేదు

Sep 18 2017 10:24 PM | Updated on Aug 10 2018 8:31 PM

ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో సోమవారం ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్‌తో కలిసి కాంగ్రెస్‌ కార్యకర్తలకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని పార్టీల ఆమోదంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.

  •  పీసీసీ చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డి
  • మడకశిర:

    ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో సోమవారం ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్‌తో కలిసి కాంగ్రెస్‌ కార్యకర్తలకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని పార్టీల ఆమోదంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేరుస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement