దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు | Bejawada Kanakadurga temple flooded with devotees | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

Nov 21 2016 8:33 AM | Updated on Aug 1 2018 3:48 PM

కార్తీక మాస చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.

విజయవాడ: కార్తీక మాస చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని దుర్గాఘాట్ కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కృష్ణానది తీరానికి చేరుకున్నారు.
 
అరటి దొప్పలలో దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. కార్తీకమాసం సందర్భంగా రుద్రయాగం, ప్రత్యేక అభిషేకాలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement