రద్దీని తట్టుకునేందుకు బార్ ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
జనం రద్దీని తట్టుకునేందుకుసినిమా హాళ్లు, బస్సు, రైల్వే స్టేషన్లలో టిక్కెట్టు క్యూ కౌంటర్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు మద్యం దుకాణాలు వారు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రద్దీ సమయాల్లో మందుబాబుల తోపులాటను నివారించే ముందు జాగ్రత్త చర్య ఇది. రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఓ మద్యం దుకాణం ముందు ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు.