బ్యాంకింగ్ రంగంలో వస్తున్న అవకాశాలను నిరుద్యోగ యువతీ, యువకులు వినియోగించుకోవాలని శ్రీసాయిగురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ దస్తగిరి రెడ్డి సూచించారు.
అనకాపల్లిరూరల్: బ్యాంకింగ్ రంగంలో వస్తున్న అవకాశాలను నిరుద్యోగ యువతీ, యువకులు వినియోగించుకోవాలని శ్రీసాయిగురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ దస్తగిరి రెడ్డి సూచించారు. శుక్రవారం గవరపాలెం సుబ్రహ్మణ్యం హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 102 కోచింగ్ సెంటర్ల ద్వారా 21వేల మంది ఉద్యోగాలు సాధించారన్నారు. బ్యాంకింగ్‌రంగంలో వస్తున్న ఉపాధి అవకాశాలు పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానం కోసం ప్రతి ఒక్కరికీ బుక్‌లెట్, డీవీడీని ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్లు, క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదలయ్యాయని చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడాలన్న లక్ష్యంతో విద్యార్థులకు అర్ధమేటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ అంశాలను సులభతరంగా వివరిస్తున్నట్టు తెలిపారు. సంస్థ విజయాల సంచికను ఆవిష్కరించారన్నారు.