ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌పై అవగాహన అవసరం | avareness is much needed for income declaration | Sakshi
Sakshi News home page

ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌పై అవగాహన అవసరం

Jul 26 2016 12:58 AM | Updated on Sep 4 2017 6:14 AM

బినామీ పేర్లు మీద ఆస్తులపై తమ పేరు ఉండాలి అంటే... ప్రతి ఒక్కరూ ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌లో భాగం కావాలని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ బి.జి.రెడ్డి కోరారు.

 
 
ఇన్‌కమ్‌ సర్టిఫికెట్, ఫిక్కీ, బినామీలు
 
బీచ్‌రోడ్‌ : బినామీ పేర్లు మీద ఆస్తులపై తమ పేరు ఉండాలి అంటే... ప్రతి ఒక్కరూ ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌లో భాగం కావాలని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ బి.జి.రెడ్డి కోరారు. ఒక ప్రైవేట్‌ హోటల్‌లో సోమవారం ఫిక్కీ ఆధ్వర్యంలో ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌లో ఇది వరకే తమ పూర్తి ఆదాయంపై పన్ను చెలించని వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా తమ అప్రకటిత ఆదాయన్ని లేదా ఆస్తులను తెలియపరచి పన్ను చెల్లించే అవకాశం ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు.  ఈ పథకం 30–09–2016 వరకు అందుబాటులో ఉంటుందని అప్పటికీ ఇంకా ఎవరైనా పన్ను చెల్లించకపోతే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. తమ వద్ద కేవలం విశాఖ నగరానికి చెందిన లక్ష అప్రకటిత లావాదేవీలు వివరాలు ఉన్నాయన్నారు.  ఈ ప«థకం ద్వారా పన్ను చెల్లించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, అలాగే మిగిలిన శాఖల నుండి ఎటువంటి ఇబ్బందులు వారికి రాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ శాఖలకు జీఓను జారీ చేసిందని వివరించారు. ఈ సదస్సులో సీహెచ్‌. ఓంకారాశ్వర్‌ మాట్లాడుతూ తమ వద్ద ఆరేళ్లుగా జరిగిన అప్రకటిత లావాదేవీలు వున్నాయి కాబట్టి ఎవరూ పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరని హెచ్చరించారు. అందువల్ల ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుని సక్రమంగా పన్ను చెల్లించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా సదస్సులో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు బదులిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement