గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి | anil died due to current shock | Sakshi
Sakshi News home page

గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి

Sep 15 2016 8:29 AM | Updated on Sep 4 2017 1:37 PM

వేములవాడ మండలం నాంపల్లిలో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.

వేములవాడ : వేములవాడ మండలం నాంపల్లిలో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్కు కరెంట్ వైర్లు తగిలాయి. దీంతో వాహనంలో ఉన్న 10 మందికి కరెంట్ షాక్ తగిలింది. వారిలో ఉన్న అనిల్ (13) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

మిగతా వారికి స్వల్పగాయాలు అయ్యాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అనిల్ మృతతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement