జలదుర్గం గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ శ్రీనివాసులు (53) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
గుండెపోటుతో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
May 9 2017 10:51 PM | Updated on Jun 4 2019 5:04 PM
ప్యాపిలి : జలదుర్గం గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ శ్రీనివాసులు (53) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. 2009 నుంచి అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా కొనసాగుతున్న ఆయన జలదుర్గం గ్రామంతో పాటు, పరిసర గ్రామాల వద్ద దాదాపు 100 మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం వివాదస్పదంగా మారడంతో డిపాజిట్లు చేసినవారు ఏజెంట్ వద్దకు వచ్చి తమ డబ్బు చెల్లించాల్సిందిగా ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిపాజిట్లు చేసిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం ఇంటివద్దే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. మృతుడికి భార్య సుగుణమ్మ, కుమారుడు యశ్వంత్, కుమార్తె ఉషారాణి ఉన్నారు.
Advertisement


