ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ.. సెల్ఫీ వీడియో | a boy from karimnagar committed suicide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ.. సెల్ఫీ వీడియో

Oct 2 2015 9:33 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ.. సెల్ఫీ వీడియో - Sakshi

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ.. సెల్ఫీ వీడియో

కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విషాదం చోటు చేసుకుంది. జూలపల్లి మండల కేంద్రంలోని బ్రిలియంట్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న సంతోష్ రెడ్డి (15) అనే విద్యార్థి ఫీజు కట్టలేనన్న మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆత్మహత్యకు గల కారణాలు వివరించాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సంతోష్ రెడ్డి స్వగ్రామం ధర్మారం మండలం అబ్బాపూర్. ఫీజు కట్టలేదని పాఠశాలలో ఉపాధ్యాయుడు బయట నిలబెట్టడంతో సదరు విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు.

ఇంటికి వచ్చిన తర్వాత తనకు బాధ కలిగిందని, మనకు ఫీజు కట్టే స్థోమత లేదని బాధపడుతూ.. తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా రికార్డింగ్ చేసి అదృశ్యమయ్యాడు. గురువారం రాత్రి పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్‌పై గుర్తుతెలియని శవం లభించగా విచారణ చేపట్టిన పోలీసులు అది సంతోష్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంతోష్ రెడ్డి మృతితో అబ్బాపూర్ గ్రామంలో ఇటు బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement