6 నుంచి జాతీయ సీనియర్‌ టెన్నిస్‌ పోటీలు | 6 out of the national senior tennis championships | Sakshi
Sakshi News home page

6 నుంచి జాతీయ సీనియర్‌ టెన్నిస్‌ పోటీలు

Feb 4 2017 6:30 PM | Updated on Sep 5 2017 2:54 AM

6 నుంచి జాతీయ సీనియర్‌ టెన్నిస్‌ పోటీలు

6 నుంచి జాతీయ సీనియర్‌ టెన్నిస్‌ పోటీలు

స్థానిక సుందరాచార్యుల ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ అసోసియేషన్‌లో ఈనెల 6 నుంచి 12 వరకు అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ భారత సీనియర్‌ టెన్నిస్‌ పోటీలను నిర్వహించనున్నట్లు కో-ఆర్డినేటర్‌ సి.రామగోవిందరెడ్డి తెలిపారు.

ప్రొద్దుటూరు కల్చరల్‌: స్థానిక సుందరాచార్యుల ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ అసోసియేషన్‌లో ఈనెల 6 నుంచి 12 వరకు అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ భారత సీనియర్‌ టెన్నిస్‌ పోటీలను నిర్వహించనున్నట్లు కో-ఆర్డినేటర్‌ సి.రామగోవిందరెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ 55 ఏళ్లు పైబడ్డ విభాగంలో క్రీడాకారులకు టెన్నిస్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు రూ.2.50లక్షలు విలువ చేసే బహుమతులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో వ్యాయామ అధ్యాపకుడు మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement