ఏపీలో 4 ప్రైవేట్‌ యూనివర్శిటీలు | 4 privite universities for andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 4 ప్రైవేట్‌ యూనివర్శిటీలు

Oct 31 2016 7:34 PM | Updated on Jul 28 2018 6:35 PM

ఏపీలో 4 ప్రైవేట్‌ యూనివర్శిటీలు - Sakshi

ఏపీలో 4 ప్రైవేట్‌ యూనివర్శిటీలు

నాలుగు ప్రైవేట్‌ యూనివర్శిటీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రైవేట్‌ యూనివర్శిటీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రెండు, శ్రీసిటీ, చిత్తూరులో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

విశాఖపట్నంలో​ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. విశాఖలోని మధురవాడ, కొమ్మడిలో 400 ఎకరాల భూసేకరణ చేయనున్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఏపీ రాజధాని ప్రాంతం సీఆర్‌డీఏ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. జనచైతన్య యాత్రలపైనా చర్చించారు. మంత్రులు 10 రోజులు సొంత నియోజకవర్గాల్లో, మరో 10 రోజులు జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement