మండల పరిధిలోని పాతముచ్చుమర్రి గ్రామంలో 144 సెక్షన్‌ను ఎత్తివేశారు.
ముచ్చుమర్రిలో 144 సెక్షన్ ఎత్తివేత
Aug 11 2016 10:41 PM | Updated on Sep 4 2017 8:52 AM
– రాయలసీమ పుష్కర ఘాట్‌కు అధికారుల నియామకం
పగిడ్యాల: మండల పరిధిలోని పాతముచ్చుమర్రి గ్రామంలో 144 సెక్షన్‌ను ఎత్తివేశారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన రాయలసీమ పుష్కర ఘాట్‌కు 13 మంది అధికారులను నియమించినట్లు కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని నందికొట్కూరు సీఐ శ్రీనాద్‌రెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. పాతముచ్చుమర్రిలో పుష్కర ఘాట్ పనులను నిలిపివేయాలని.. గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఈనెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆర్డీవో రఘుబాబు ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటన వివాదాస్పదం కావడంతో అధికారులు 144 సెక్షన్‌ను తొలగించారు. అంతేకాకుండా ఘాట్ వద్ద అధికారులను నియమించారు.
Advertisement
Advertisement