
టీడీఎఫ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
అమెరికా మిస్సోరిలో గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతం అయింది.
అమెరికా మిస్సోరిలో గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి శ్రీ రాజ్ చీదెల్ల అధ్యక్షత వహించగా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వర్ రెడ్డి కలవల, గీత, సుచరిత, బిందు ముఖ్య అతిధులుగా వ్యవహరించారు. మొదటగా తెలంగాణా అమరులకు సభ రెండు నిముషాలు మౌనం పాటించిన తరువాత అనంతరం జయశంకర్కు ఘనంగా నివాళులు అర్పించారు.
ఆ తరువాత కార్యక్రమ నిర్వహణలో శరత్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా నాగభూషణం విద్యారంగము గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. అనంతరం సూర్యారావు గారు తాను అభివృద్ధి పరచిన తెలంగాణా ఫ్యాక్త్స్ (telanganafacts) అనే ట్విటర్ అకౌంట్ గురించి మరియు తెలంగాణా నూతన ప్రభుత్వంలో జరుగుతున్నఅభివృద్ధి కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు.
విశ్వేశ్వర్ కలవల మాట్లాడుతూ 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణా పోరాటంతో పాటు అందులో గత పదిహేను సంవత్సరాల తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం యొక్క క్రియాశీల అనుబంధం గురించి సవివరంగా వివరించారు. తరువాత గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం తరపున బిందు, ఇతర ముఖ్యఅతిధుల మధ్య మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ క్యాన్సస్ సిటి తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం సభ్యులు, మేధావులు హాజరయ్యారు.