కెనడాలో టీడీఎఫ్ (కెనడా) ఆధ్వర్యంలో ఈ నెల 24న బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.
కెనడా: కెనడాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (కెనడా) ఆధ్వర్యంలో ఈ నెల 24న టొరంటో(మిస్సిసౌగ) నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 500 మంది హాజరు కాగా, అచ్చమైన తెలంగాణ సంప్రదాయ రీతిలో బతుకమ్మ పండుగను కన్నులపండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు. అనంతరం రకరకాల సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా టీడీఎఫ్ కెనడా నిర్వాహకులు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతూనే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్యక్రమాలను చేస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖతో అనుసంధానమై ఈ కార్యక్రమం నిర్వహించబడింది.