 
															ముగిసిన నాటా మహాసభలు
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి
	వాషింగ్టన్ :  ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రెండో ద్వైవార్షిక నాటా మహాసభలు అట్లాంటాలో విజయవంతంగా నిర్వహించారు.  అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో ఈ నెల 4న ప్రారంభమై ఆదివారం ముగిసిన ఈ మహాసభలలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు.
	
	నాటా మహాసభల్లో  జార్జియా రాష్ట్ర గవర్నర్ నేథన్‌డీల్ దంపతులతోపాటు వివిధ రంగాల సినీప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి,  దేవిశ్రీప్రసాద్,  చంద్రబోస్, తమన్నా, ప్రణీత, లయ, విమలారామన్, కళ్యాణి, రోజా, సింగర్ సునీత, మల్లికార్జున్, గోపిక, శివారెడ్డి,  ఏపి,  తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
	
	నాటా సభల నిర్వహణకు సహకరించినవారికి, హాజరైన అతిథులకు ‘నాటా‘ అధ్యక్షుడు సంజీవ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  కో-ఆర్డినేటర్ శ్రీనిరెడ్డి వంగిమళ్ల, కన్వీనర్ బాల ఇందూరి, కో-కన్వీనర్ టి. సత్యనారాయణ రెడ్డి, కొమ్మిడి శ్రీనివాసరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో  ‘నాటా‘ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
