సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌ | Young Man Hulchul On Cell tower | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

Apr 13 2018 1:43 PM | Updated on Aug 1 2018 2:31 PM

Young Man Hulchul On Cell tower - Sakshi

కిందకు దిగిన అనంతరం బద్రితో మాట్లాడుతున్న పోలీసులు

మడికొండ:సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్‌ చేసిన సంఘటన మడికొండలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులో ఉన్న రామన్‌ స్కూల్‌లో పని చేస్తూ జీవిస్తున్నాడు. గత నెల రో జుల క్రితం పాఠశాల యజమాన్యం పనిలో నుంచి తీసివేయడంతో మానసికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చె ప్పారు. గురువారం ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీ య రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్‌ టవర్‌ ఎ క్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అం దించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బద్రిని తాళ్లతో కట్టి కిందకు దించారు. తిరిగి గంట తర్వాత మళ్లీ టవర్‌ పైకి ఎక్కి నాకు ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే కిందకు దూకుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో మడికొండ ఇన్స్‌పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి  చేరుకుని టవర్‌ పైకి ఎందుకు వెళ్లావని బద్రిని అడగటంతో స్కూల్‌ నుంచి తనను తీసివేశారు, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బద్రి చెప్పాడు. దీంతో రామన్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాజేష్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి మాట్లాడించి కిందకు దింపారు.

Advertisement
 
Advertisement
Advertisement