బంధువులను పరిచయం చేస్తానని చెప్పి.. | Woman Pushed Into Deep Gorge By Her Partner In Dehradun | Sakshi
Sakshi News home page

బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..

Jul 23 2019 2:45 PM | Updated on Jul 23 2019 2:50 PM

Woman Pushed Into Deep Gorge By Her Partner In Dehradun - Sakshi

డెహ్రాడూన్‌ : తన బంధువులకు పరిచయం చేస్తానని చెప్పి ఓ మహిళను లోయలో తోసిన ఘటన ఆదివారం ఉత్తరాఖండ్‌లోని పాటూరి జిల్లాలో చేటు చేసుకుంది. కాగా ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మహిళను 108 సిబ్బంది, అక్కడి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరేంద్ర పత్వాల్‌ అనే వ్యక్తి భాదితురాలితో కలిసి రెండేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అద్వానీ గ్రామంలో ఉంటున్న తన బంధువులకు పరిచయం చేస్తానని చెప్పి ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయలుదేరారు. అద్వానీ గ్రామ శివారుకు రాగానే వారిద్దరు ట్యాక్సి దిగి నడుచుకుంటూ వెళ్తుండగా బీరేంద్ర పత్వాల్‌  సదరు మహిళను పక్కనే ఉన్న లోయలోకి నెట్టేసి అక్కడినుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

కాగా సోమవారం ఉదయం లోయ నుంచి కేకలు వినిపించడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వీలైనంత తొందరగా నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement