అత్యాచార బాధితురాలికి నిందితుడి వార్నింగ్‌!

Woman Molested Threatened With Fate Worse Than Unnao In UP - Sakshi

లక్నో: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా అవసరమైతే బాధితుల ప్రాణాలు తీయడానికి కూడా మానవ మృగాలు వెనుకాడట్లేదు. గత గురువారం ఉన్నావ్‌ బాధితురాలు కోర్టు విచారణకు హాజరవటానికి వెళుతుండగా మార్గం మధ్యలో కాపుకాసిన నిందితులు ఆమెను సజీవదహనం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అత్యాచార బాధితురాలిని కూడా చంపేస్తామంటూ ఆమె ఇంటిపై లేఖ అతికించడం కలకలం రేపింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని భగపట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం అత్యాచారానికి గురైంది. దీనిపై జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని బెయిల్‌పై వదిలేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో నిందితుడు బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నువ్వు కోర్టు విచారణకు హాజరయ్యావంటే ఉన్నావ్‌ కంటే దారుణంగా చంపుతా’ అని ఆమె ఇంటి ముందు వార్నింగ్‌ లెటర్‌ అతికించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలికి భద్రత ఏర్పాటు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top